AP: టీడీపీలో నారా లోకేశ్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించే అంశంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది. పార్టీ కమిటీలపై శనివారం కసరత్తు మొదలైనందున, లోకేశ్ నియామకంపై కూడా తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే, ఈ కీలక ప్రకటనను దీపావళి పండుగ సందర్భంగా చేస్తారా? లేక మరొక మంచి ముహూర్తం చూసి ప్రకటిస్తారా? అనేది సస్పెన్స్‌గా మారింది. లోకేశ్‌కు ఈ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ మరింత బలోపేతం అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.