పొల్యూషన్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ప్రొవిజనల్ జాబితాను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. అభ్యర్థులు https://psc.ap.gov.in అధికార వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది. 2023లో 21 ఏఈఈ పోస్టుల భర్తీకి బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన వారికి నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు జీతం రానుంది.