కర్నూల్ జిల్లా కోడుమూరులో దారుణ హత్య కలకలం రేపింది. మద్యం మత్తులో తన స్నేహితుడి గొంతు కోసి హతమార్చాడు. స్థానిక గిరి, మౌలాలి స్నేహితులు. జేసీబీ డ్రైవర్లుగా పనిచేస్తున్న వీరు ఒకే గదిలో ఉంటారు. ఈ నేపథ్యంలో వైన్ షాప్ దగ్గర మద్యం గురించి ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కోపోద్రిక్తుడైన మౌలాలి, గిరి గొంతు కోసి హతమార్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.