కేంద్ర ప్రభుత్వం ఏపీకి 4 కొత్త కేంద్రీయ విద్యాలయాలను (KV) మంజూరు చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర కేబినెట్ దేశవ్యాప్తంగా 57 కొత్త కేవీలకు ఆమోదం తెలపగా, అందులో తెలుగు రాష్ట్రాలకు 8 లభించాయి. తెలంగాణకు కూడా 4 కేవీలు మంజూరయ్యాయి. ఏపీలో ఈ 4 కేంద్రీయ విద్యాలయాలను మంగసముద్రం (చిత్తూరు), బైరుగానిపల్లె (కుప్పం), పలాస (శ్రీకాకుళం), శాఖమూరు (అమరావతి) లలో ఏర్పాటు చేయనున్నారు.