AP: ఇటీవల 11 కార్పొరేషన్లకు సంబంధించి 120 మంది డైరెక్టర్లను నియమించిన ఏపీ ప్రభుత్వం.. తాజాగా మరో నాలుగు కార్పొరేషన్లకు 51 మంది డైరెక్టర్లను నియమించింది. ఏపీ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు 16 మంది, కమ్మ కార్పొరేషన్‌కు 15 మంది, రాష్ట్ర నూర్‌బాషా దూదేకుల కార్పొరేషన్‌కు 15 మంది , వెనకబడిన తరగతుల సహకార సంఘానికి ఐదుగురు డైరెక్టర్లను నియమిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.