AP: టిడ్కో ఇళ్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. “వివిధ కేంద్ర పథకాలు, ఫండింగ్ ఏజెన్సీల ద్వారా మున్సిపాల్టీల్లో పనులు చేపడున్నాం. ప్రాధాన్యతా క్రమంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలి. (AIIB), (UIDF) నిధుల ద్వారా డ్రింకింగ్ వాటర్, డ్రైనేజి నిర్మాణాలు చేపడుతున్నాం. నిర్మాణాలు పూర్తయ్యే టిడ్కో ఇళ్లను ప్రతి శనివారం లబ్దిదారులకు కేటాయించాలి. వచ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్ల నిర్మాణం వంద శాతం పూర్తి చేయాలి” అని మంత్రి నారాయణ అధికారులకు సూచించారు.