ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముగ్గురు నిందితులకు తాజాగా బెయిల్ మంజూరైంది. ధనుంజయ్, కృష్ణమోహన్, బాలాజీ గోవిందప్పకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇక ఏపీ లిక్కర్ కేసులో సిట్ అధికారులు బాలాజీ గోవిందప్పను మే 13న, ధనుంజయ్, కృష్ణమోహన్ రెడ్డిని మే 16న అరెస్ట్ చేశారు. అలాగే ఎంపీ మిథున్ రెడ్డికి కూడా బెయిల్ మంజూరు అయిన సంగతి తెలిసిందే.