AP: ఫ్రీ బస్సుల్లో లైవ్ ట్రాకింగ్: చంద్రబాబు

AP: కూటమి ప్రభుత్వం ఇటీవల మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం ‘స్త్రీ శక్తి’. ఆర్టీసీలో మహిళలకు పెట్టిన ఫ్రీ బస్సులో త్వరలోనే లైవ్ ట్రాకింగ్ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్టీసీపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. ‘మహిళల సహకారంతోనే ఫ్రీ బస్సు పథకం విజయవంతమైంది. ఉచిత బస్సులకు రెండు వైపులా బోర్డులు పెట్టాలి. రాష్ట్ర మహిళల్లో చైతన్యం ఎక్కువ.. కాబట్టి ప్రభుత్వ పథకాలను అందిపుచ్చుకుని అభివృద్ధి చెందుతారు’ అని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్