AP: బ్యాంకులోనే ఉరేసుకున్న మేనేజర్ (వీడియో)

అన్నమయ్య జిల్లా రాయచోటిలో శుక్రవారం విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రైవేటు బ్యాంక్ మేనేజర్ CH పవన్ బ్యాంక్ భవనంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, మృతుడి భార్య అనూష సంఘటనా స్థలానికి చేరుకుని ఆరా తీస్తున్నారు. పవన్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల బ్యాంకు పనుల్లో అధిక ఒత్తిడి కారణంగానే ఆయన ప్రాణాలు తీసుకున్నాడని భార్య అనూష ఆరోపించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్