AP: పొగాకు రైతుల ఖాతాల్లోకి రూ.273 కోట్లు జమ

AP: పొగాకు రైతులకు శుభవార్త. నల్ల బర్లీ పొగాకు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం రూ.273 కోట్లు జమ చేసింది. మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన రైతులకు ఈ మొత్తాన్ని జమ చేసింది. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. చివరి పొగాకు ఆకు వరకు కొనుగోలు చేసి తీరుతామన్నారు. కూటమి ప్రభుత్వంలో రైతులు రాజులా బతకాలని అన్నారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడుకు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్