అనంతపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నాయకురాలు తేజస్విని కారుపై దుండగులు రాళ్లతో దాడి చేశారు. మంగళవారం ‘సూపర్ సిక్స్-సూపర్ సక్సెస్’ కార్యక్రమానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఈ దాడిలో ఆమె కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా కూటమి ప్రభుత్వం చేస్తోన్న అభివృద్ధిని తట్టుకోలేక వైసీపీ నేతలు ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని తేజస్విని ఆరోపించారు. దుండగులను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.