అమెరికాలో ఏపీకి చెందిన 23 ఏళ్ల యువకుడు మృతిచెందాడు. బాపట్ల జిల్లా మార్టూరుకు చెందిన గ్రానైట్ వ్యాపారి కుమారుడు పాటిబండ్ల లోకేశ్ (23) స్మిమ్మింగ్ పూల్‌లో పడి చనిపోయాడు. లోకేశ్ ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లాడు. అతడి మృతితో మార్టూరులో విషాదఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని త్వరగా మార్టూరుకు తీసుకువచ్చేందుకు సహకారం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.