AP: విజయనగరం జిల్లా గజపతినగరం యూరియా సెంటర్ వద్ద సోమవారం తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాజకీయ సిఫార్స్‌లతో యూరియా ఇస్తున్నారని రైతులు అధికారులతో గొడవకు దిగారు. ఉదయం నుంచి లైన్లలో పడిగాపు కాస్తున్నామని, కొందరికే యూరియా ఇస్తున్నారని రైతులు వాగ్వాదానికి దిగారు. యూరియా కార్యాలయంలోకి ఒక్కసారిగా దూసుకెళ్లి చైర్లు, ఫర్నిచర్లు ధ్వంసం చేశారు.