భార్యపై భర్త దాడి ఘటన.. తీవ్రంగా ఖండించిన ఏపీ మహిళా కమిషన్‌

AP: ప్రకాశం జిల్లాలో భార్యపై దారుణంగా దాడి చేసిన ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్‌ ఖండించింది. తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు ఎస్టీ కాలనీలో జరిగిన ఘటనను తీవ్రంగా పరిగణించింది. ఇలాంటి దురాగతాలను సమూలంగా నిర్మూలించాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ అన్నారు. ఈ ఘటనను సుమోటోగా తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు. మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలన్నారు.

సంబంధిత పోస్ట్