AP: విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలో ఉన్న బాల్సోత్సవ్ భవన్‌లో ఈ నెల 11న ఆక్వా రైతుల రాష్ట్ర సదస్సు నిర్వహిస్తామని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య తెలిపారు. ఆదివారం ఆయన దీనికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వి.కృష్ణయ్య మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఆక్వా ఉత్పత్తులను గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తామని భరోసా కల్పించాలని, తక్కువ సుంకాలున్న దేశాలకు ఎగుమతులు ప్రోత్సహించాలని డిమాండ్ చేశారు.