అరకు కాఫీ కూడా చాలా ప్రసిద్ధి చెందింది: సీఎం చంద్రబాబు

విశాఖలో జరిగిన గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్‌ సమ్మిట్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, "మహిళల భద్రత విషయంలో విశాఖ అగ్రస్థానంలో ఉన్నట్టు ఇటీవల సర్వేలో తేలింది. విశాఖలో అద్భుత వాతావరణం ఉంది.. సముద్రం, అందమైన కొండలు ఉన్నాయి. అరకు కాఫీ కూడా చాలా ప్రసిద్ధి చెందింది" అని తెలిపారు. ఈ సమ్మిట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో పాటు పలువురు వ్యాపార వేత్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్