ఏపీలో దారుణం.. యువకుడి దారుణ హత్య (వీడియో)

AP: నెల్లూరు జిల్లాలోని గూడూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఓ యువకుడు  శ్మశాన వాటికలో దారుణ హత్యకు గురయ్యాడు. టిడ్కో గృహాల్లో నివాసం ఉంటున్న రహీద్ బాషాను గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. రక్తపు మడుగులో రోడ్డు పక్కన పడి ఉన్న యువకుడి మృతదేహన్ని స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రహీద్ హత్యతో గూడూరు ఉలిక్కిపడింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్