AP: అనకాపల్లి జిల్లా అడ్డూరు దగ్గర బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఆర్టీసీ బస్సు, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి స్వల్ప గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.