అవినాష్‌రెడ్డికి బిగుస్తోన్న ఉచ్చు.. మళ్లీ రంగంలోకి సీబీఐ?

AP: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు మళ్ళీ మొదటికొచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వివేకా కుమార్తె సునీత రెండు వారాల్లో పూర్తి వివరాలతో సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఒకవేళ కోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే ఎంపీ అవినాష్ రెడ్డికి ఇబ్బందులు తప్పకపోవచ్చని, ఈసారి అరెస్టు నుంచి ఆయన తప్పించుకోలేరని విశ్లేషకులు చెబుతున్నారు. సునీత బాధితురాలు కావడంతో ఆమెకు అనుకూలంగా తీర్పు రావచ్చని ఆమె మద్దతుదారులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్