ఏపీ అసెంబ్లీపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర విమర్శలు చేశాడు. హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ.. చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా స్పందించాడు. ‘ఏపీ అసెంబ్లీ చాలా అధ్వానంగా తయారైంది. నాకే ఛీ అనిపిస్తుంది. బాలకృష్ణ తాగేసి వచ్చాడని చాలా మంది అంటున్నారు. తోటి యాక్టర్ చిరంజీవిని తిట్టడం చాలా తప్పు. పవన్ కల్యాణ్‌కు నిజంగానే జ్వరం వచ్చిందో లేక తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడో అర్థం కాట్లేదు’ అని అన్నారు.