మేదరమెట్ల: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

మెదరమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంకటాపురం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని వెనక నుండి కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న అలవలపాడు గ్రామానికి చెందిన వజ్జ సుబ్బయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. అతనిని అద్దంకి ఆసుపత్రికి తీసుకువెళ్లే క్రమంలో మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై మహమ్మద్ రఫీ తెలిపారు.

సంబంధిత పోస్ట్