అద్దంకిలో 600 ఏళ్ల నాటి అతి ప్రాచీన కమటేశ్వర స్వామి ఆలయం ఉంది. కొండవీడును రాజధానిగా చేసుకొని పరిపాలించిన పెద కోమటి వేమారెడ్డి ప్రతినిధి బాణాల లింగన్న 1410సం.లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురావస్తు పరిశోధకులు జ్యోతి చంద్రమౌళి తెలిపారు. ఆలయంలో స్వయంభులింగం భూమికి కొద్ది ఎత్తులో ఉండడం విశిష్ఠత. ఈ ఆలయంలో కార్తీకమాసం శివరాత్రి పర్వదినాలలో భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని పూజలు చేస్తుంటారు.