అద్దంకిలో వాగు ఉప్పొంగి, రోడ్డు కొట్టుకుపోయింది

అద్దంకి మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. గురువారం మోదేపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చిలకలేరు వాగు వరద నీటి ధాటికి రోడ్డు కోతకు గురై, బ్రిడ్జి కూడా కొట్టుకుపోయింది. ప్రస్తుతం వాగు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్