బాపట్ల జిల్లా మార్టూరు మండలం వలపర్ల గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. కొండలరావు నాగిని దంపతులు సెలవుల కారణంగా ఊరికి వెళ్లడంతో, తాళం వేసి ఉన్న వారి ఇంట్లోకి చొరబడిన దొంగలు బంగారం, వెండితో పాటు భారీ మొత్తంలో సొత్తును అపహరించుకెళ్లారు. సమాచారం అందుకున్న బాపట్ల డిఎస్పి, మార్టూరు సిఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఒంగోలు నుంచి క్లూస్ టీం వస్తున్నట్లు సమాచారం.