వేటపాలెం మండలం చెల్లారెడ్డిపాలెం NH 216 వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను రెవెన్యూ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. ఈ ట్రాక్టర్లను సీజ్ చేసి వేటపాలెం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమ ఇసుక రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.