చీరాల బీచ్‌ను అధికారులు మూసివేశారు, భారీ అలల హెచ్చరిక

బాపట్ల జిల్లా చీరాల బీచ్‌ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. తీరప్రాంతాల్లో భారీ అలలు, సుడిగుండాలు ఏర్పడటంతో ప్రమాద భయం నెలకొంది. పర్యాటకులు, భక్తుల భద్రత దృష్ట్యా వాడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం బీచ్‌లలో పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యంగా కార్తీకమాస స్నానాల కోసం ప్రజలు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను కూడా సముద్ర యాత్రలు నివారించాలని సూచించారు. పరిస్థితులు సర్దుకునే వరకు జాగ్రత్తగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్