దొంగల ముఠా సంచారం: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

బాపట్ల జిల్లా చీరాల రూరల్ పోలీస్ శాఖ మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు సభ్యుల దొంగల ముఠా ప్రాంతంలో సంచరిస్తున్నట్లు హెచ్చరించింది. ఈ ముఠా నెల్లూరు, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఇప్పటికే దొంగతనాలకు పాల్పడినట్లు సమాచారం. వీరు తక్కువ రేటు లాడ్జ్‌లలో తలదాచుకుంటూ, ఎక్కడైనా నేరానికి పాల్పడే అవకాశం ఉంది. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే 112కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని, విలువైన వస్తువులను బ్యాంకుల్లో భద్రపరుచుకోవాలని పోలీసులు సూచించారు.

సంబంధిత పోస్ట్