ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు వైభవంగా జరుగుతున్నాయి. ఆరవ రోజు అమ్మవారు శ్రీ స్కందమాత దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మయూర వాహనంపై అమ్మవారి పల్లకి సేవ ఊరేగింపులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని, వాహనం మోసేందుకు పోటీపడ్డారు. ఉభయ రాష్ట్రాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. 'జై బాల, జై బాల, హర హర మహాదేవ శంభో శంకర' అంటూ భక్తుల నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది.