రాష్ట్రంలో ప్రభుత్వం తరఫున తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కేవలం రూ. 67 రూపాయలకే కందిపప్పును, రూ. 17 రూపాయలకే పంచదారను అందజేస్తున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయనున్న కార్యక్రమాన్ని మంగళవారం తెనాలి మారిస్ పేటలో ప్రారంభించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.