మొంథా తుఫాన్: చీరాల తీరం దెబ్బతింది, సముద్ర స్నానాలకు నో ఎంట్రీ

మొంథా తుఫాన్ ప్రభావంతో చీరాల సముద్ర తీర ప్రాంతం తీవ్రంగా దెబ్బతింది. వాడరేవు, రామాపురం ప్రధాన రహదారి దెబ్బతినడంతో రెండు రోజుల పాటు సముద్రం మూసివేయబడింది. కార్తీక మాసంలో సముద్ర స్నానాలకు వచ్చే భక్తులు, పర్యాటకులను తీరానికి రావద్దని ఆర్డీఓ చంద్రశేఖర్ తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు ఆదివారం చీరాల తీర ప్రాంతాన్ని పరిశీలించారు. సముద్రంలో, తీర అంచున గుంటలు ఏర్పడటంతో పాటు రహదారి కోతకు గురైందని అధికారులు తెలిపారు. గజ ఈతగాళ్ల పరిశీలనలోనూ తీరం స్నానాలకు అనుకూలంగా లేదని తేలింది. దీంతో ఈ నెల 3, 4 తేదీల వరకు చీరాల, వేటపాలెం సముద్ర తీర ప్రాంతాలలో ప్రజలు, సందర్శకులు సముద్ర స్నానాలకు రావద్దని అధికారులు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్