రైతు రుణాలు మాఫీ చేయాలి

{"What":" రైతులు వ్యవసాయం సాగు చేయాలంటేనే భయపడే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఉందని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కందిమల్ల రామ కోటేశ్వరరావు అన్నారు. పకృతి వైపరీత్యాలు తెగుళ్లు, కీటకాలు తదితర సమస్యలు తట్టుకొని నిలబడి పంట పండించిన, పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు అప్పుల పాలయ్యారని అన్నారు . ఇటువంటి తరుణంలో వ్యవసాయం మరియు రైతులు సంక్షోభం నుంచి బయట పడాలంటే ప్రభుత్వాలు వెంటనే రైతు రుణమాఫీ ప్రకటించాలని డిమాండ్ చేశారు . ఇంకొల్లు మండలంలో ఇంకొల్లు మరియు చిన్నగంజాం మండలాలకు సంబంధించి నా రైతు సంఘం సమావేశం స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సమావేశంలో పాల్గొన్న రైతులతో ఆ ప్రాంత వ్యవసాయము పరిస్థితులు, ధరలు, రైతుల జీవన విధానము, కుటుంబ పోషణ గురించి అభిప్రాయాలు అడిగారు. ఇంకొల్లు చిన్నగంజాం మండలాలలోని పలు గ్రామాల రైతులు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు ఏ పంట వేయాలో? ఏ పంట పండించాలో?అర్థం కాని అయోమయ స్థితిలో ఉన్నారని అన్నారు. ప్రస్తుత పది స్థితులు చూస్తే ఏ పంట వేసిన రైతులకు గిట్టుబాటు అయ్యే పరిస్థితి లేదన్నారు. వ్యవసాయం చేసే రైతులందరూ అప్పుల ఊబిలో కురుకపోయారని ఆవేదన వ్యక్తపరిచారు. ","Where":"పర్చూరు నియోజకవర్గం వార్త.","When":"","Additional info":"సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని రైతులను కాపాడుకోవాలంటే రైతు రుణమాఫీతోనే ఊరట. రైతు సంఘం డిమాండ్."}

సంబంధిత పోస్ట్