ఉపరితలం ఆవర్తనం కారణంగా కురుస్తున్న వర్షాలకు రేపల్లె నియోజకవర్గంలో 9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు ఆర్డీవో రామలక్ష్మి తెలిపారు. గురువారం నుండి శుక్రవారం ఉదయం వరకు చెరుకుపల్లి మండలం 2.0 మి.మీ., నిజాంపట్నం మండలం 3.2 మి.మీ., నగరం మండలం 1.6 మి.మీ., రేపల్లె మండలం 2.2 మి.మీ. వర్షపాతం నమోదయింది. ఈ వివరాలను మండలాల వారీగా ఆర్డీవో వెల్లడించారు.