నగరం ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిబిరం

నగరం ప్రభుత్వ ఆసుపత్రిలో శుక్రవారం స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు శివప్రసాద్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఆరోగ్య రూపురేఖలను మార్చేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశేష కృషి చేస్తున్నారని, దేశవ్యాప్తంగా వైద్య మరియు ఆరోగ్య శిబిరాలు, 8వ జాతీయ పోషణ మాసోత్సవ ప్రారంభం, మరియు ప్రధానమంత్రి మాతృ వందన యోజన క్రింద ప్రసూతి ప్రయోజనాలు నారీ పరివార్ అభియాన్ కార్యక్రమం ద్వారా జరుగుతాయని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్