చుండూరు: ముఖ్యమంత్రి సహాయ నిధిని అందించిన ఎమ్మెల్యే

చుండూరు మండలం పెద గాదెలవర్రు గ్రామానికి చెందిన దాసరి హేమావతి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఎమ్మెల్యే ఆనందబాబు సహకారంతో సీఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేసుకుంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనందబాబు చొరవ తీసుకొని ఆమెకు ముందస్తుగా ఎల్ఓసిని మంజూరు చేపించారు. మంగళవారం 1, 50, 850 రూపాయల చెక్కును ఎమ్మెల్యే బాధితురాలకి అందజేశారు. ఈ సందర్భంగా సహకారం అందించిన ఎమ్మెల్యే ఆనందబాబుకు బాధిత మహిళ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్