బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, సోమవారం రేపల్లె ఆర్డీవో కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.