రేపల్లె రెవిన్యూ డివిజన్‌లో బుధవారం కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ వరద ముంపు గ్రామాలైన పెసర్లంక, చింతలంక, వీపుర్లంక, సగ్గునలంక, చిలుమురులంక గ్రామాలలో క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రేషన్ షాపులను తనిఖీ చేసి డీలర్ల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొల్లూరు మండలంలోని పునరావాస కేంద్రాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ పర్యటనలో రేపల్లె ఆర్డిఓ రామలక్ష్మి, అధికారులు పాల్గొన్నారు.