పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరు సమాధానం చేయాలి

పట్టణ పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ రోజుకు ఒక గంట పాటు శ్రమదానం చేయాలని మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు పిలుపునిచ్చారు. గురువారం రేపల్లె పట్టణంలోని పలు వార్డుల్లో అధికారులు శ్రమదానం చేసి పరిసరాలను పరిశుభ్రంగా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 'ఏక్ దిన్ ఏక్ గంట ఏక్ సాత్' శ్రమదానం నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలు చెత్తలను నిర్దేశిత ప్రదేశాల్లోనే వేయాలని, మునిసిపల్ కార్మికులకు సహకరించాలని సూచించారు. వినాయకుడి గుడి పరిసరాల్లోని చెత్త పాయింట్‌ను శుభ్రపరిచారు.

సంబంధిత పోస్ట్