ఈనెల 27, 28 తేదీలలో జరిగే సిఐటియు బాపట్ల జిల్లా రెండవ మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు బాపట్ల జిల్లా అధ్యక్షుడు మణిలాల్ పిలుపునిచ్చారు. రేపల్లెలో నిర్వహించనున్న ఈ మహాసభల కోసం శుక్రవారం ఆహ్వానసంఘం ఏర్పాటు చేశారు. ఈ సంఘానికి వ్యాపారవేత్త మోపిదేవి శ్రీనివాసరావు గౌరవ అధ్యక్షులుగా, పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి కే. సాయి ప్రసాద్ అధ్యక్షులుగా, సిఐటియు జిల్లా అధ్యక్షులు మణిలాల్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ఫెడరేషన్ ప్రముఖులు కూడా ఈ ఆహ్వానసంఘంలో భాగస్వాములయ్యారు.