రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) నిర్వహిస్తున్న రణభేరి కార్యక్రమంలో భాగంగా, రేపల్లె పట్టణంలో ఉపాధ్యాయులు బుధవారం ప్రదర్శన నిర్వహించారు. నెహ్రూ బొమ్మ వద్ద యుటిఎఫ్ ప్రచురణల కమిటీ రాష్ట్ర చైర్మన్ వి. హనుమంతరావు మాట్లాడుతూ, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, బోధనేతర కార్యక్రమాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అస్తవ్యస్తంగా ఉన్న పాఠశాలల వ్యవస్థను సరిదిద్దాలని, వేల కోట్ల ఆర్థిక బకాయిలను చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న నాలుగు డిఏలను వెంటనే మంజూరు చేయాలని ఆయన కోరారు.