జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్ డీజిల్ ధరలు రావా

తెలుగుదేశం పార్టీ బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దివి రాంబాబు గురువారం చెరుకుపల్లిలో మాట్లాడుతూ, కేంద్రం జీఎస్టీ ద్వారా నిత్యవసర వస్తువులపై పన్ను తగ్గించడం పేద, మధ్యతరగతి ప్రజల జీవన స్థితిగతులను మెరుగుపరుస్తుందని, ఇది హర్షించదగ్గ విషయమని అన్నారు. అయితే, పెట్రోల్, డీజిల్ ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తెచ్చి తగ్గించి ఉంటే పేదలకు మరింత ఉపయోగకరంగా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. రోజువారీ జీవితంలో పెట్రోల్, డీజిల్ వినియోగం తప్పనిసరి కాబట్టి, ధరలు తగ్గితే పేదలకు మేలు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్