ఉత్తర, దక్షిణ కోస్తాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రేపల్లె ఆర్డీవో రామలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం, వేమూరు నియోజకవర్గంలో 165.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం నుండి గురువారం వరకు కురిసిన వర్షపాతం వివరాలను ఆమె వెల్లడించారు. చుండూరు మండలంలో 43.2 మి.మీ., అమర్తలూరు మండలంలో 50.4 మి.మీ., వేమూరు మండలంలో 12.8 మి.మీ., కొల్లూరు మండలంలో 31.8 మి.మీ., భట్టిప్రోలు మండలంలో 27.2 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.