కొల్లూరు మండలం తోకలవానిపాలెం గ్రామం సర్పంచ్ టి కృష్ణమోహన్ తండ్రి టి. రమేష్ అనారోగ్యంతో మృతి చెందారు. గురువారం ఆయన పార్థివ దేహానికి వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు నివాళులర్పించి, కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గ్రామ అభివృద్ధికి కృషి చేసిన రమేష్ మృతి తీరని లోటని, కృష్ణమోహన్ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే ఆనందబాబు పేర్కొన్నారు.