బాపట్ల జిల్లాలో అనుకోని పరిస్థితుల్లో కృష్ణానది వరదలు వస్తే ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం రాత్రి కొల్లూరు ఎంపీడీవో కార్యాలయంలో రేపల్లె డివిజన్ రెవిన్యూ అధికారి ఎన్. రామలక్ష్మి, డీపీఓ ప్రభాకర్ లతో కలిసి కృష్ణానది వరదలపై జిల్లా, మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరదలను ఎదుర్కోవడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.