వేమూరు మండలం పెనుమర్రు సచివాలయం పరిధిలోని రైతులకు యూరియా పంపిణీలో తెలుగుదేశం పార్టీ నాయకులు వివక్ష చూపుతున్నారని రైతులు ఆరోపించారు. తమ పార్టీ కార్యకర్తలకే యూరియా ఇస్తామని, మిగిలితేనే ఇతరులకు ఇస్తామని బహిరంగంగా చెబుతున్నారని రైతులు వాపోయారు. బయటి ప్రాంతాల నుంచి వచ్చిన వారికి యూరియా అందిస్తున్నారని, స్థానిక రైతులకు అన్యాయం జరుగుతోందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.