AP: టీటీడీ మాజీ ఛైర్మన్, వైకాపా నేత భూమన కరుణాకర్‌రెడ్డితో పోలీసుల విచారణ ముగిసింది. శనీశ్వరుడి విగ్రహం వివాదంలో ఆయన శుక్రవారం సాయంత్రం తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరు కాగా.. దాదాపు నాలుగున్నర గంటల పాటు డీఎస్పీ భక్తవత్సలం విచారించారు. విగ్రహంపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని భూమన తెలిపారు. ఆయన్ను మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం.