వైసీపీ నేత, TTD మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి IAS శ్రీలక్ష్మి మీద చేసిన వ్యాఖ్యలను TTD బోర్డు సభ్యుడు, BJP నేత భానుప్రకాశ్ రెడ్డి ఖండించారు. "మహిళపై ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా?. IAS శ్రీలక్ష్మి ఎవరి వల్ల జైలుకు వెళ్లిందో తెలియదా?. TDR బాండ్స్‌లో అక్రమాలు జరిగింది వాస్తవం కాదా?. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడటం సరికాదు. ఓడిపోయిన తర్వాత భూమన రాజకీయ నిరుద్యోగిగా మారారు. ఆయన మానసిక పరిస్థితి బాలేదు" అంటూ సెటైర్లు వేశారు.