AP: ప్రొద్దుటూరు టీడీపీ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డికి కడప జిల్లా కోర్టులో బిగ్ షాక్ తగిలింది. ఆయన కుటుంబీకుల ఆస్తిని జప్తు చేయాలని కోర్టు వెల్లడించింది. హైదరాబాద్‌కు చెందిన పృథ్వి అసెట్స్ రీకనస్ట్రక్షన్ లిమిటెడ్ వద్ద ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డికి చెందిన రాధ కన్‌స్ట్రక్షన్ అప్పు తీసుకుంది. దీన్ని తీర్చకపోవడంతో బాధితులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన 2 ఎకరాల ఆస్తిని జప్తు చేసుకోవాలని తీర్పిచ్చింది.