AP: విశాఖలో అర్ధరాత్రి విషాదం చోటు చేసుకుంది. సిరిపురం జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహారాణిపేటలోని ఊటగెడ్డకు చెందిన ఇంటర్ విద్యార్థి హరీశ్ (17) మృతి చెెందాడు. బైక్‌పై వేగంగా వెళ్తుండగా.. అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో హరీశ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. దర్యాప్తు చేస్తున్నారు.