AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ తొక్కిసలాటలో మరణించిన బాధిత కుటుంబాలకు YCP తరఫున రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అలాగే, ఏపీలో శాంతిభద్రతల లోపం, పాలనా వ్యవహారాలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో హత్యలు, మానభంగాలు, అక్రమ కేసులు మామూలయ్యాయని, ప్రజల సంక్షేమం కంటే రాజకీయాన్నే ప్రభుత్వం పట్టించుకుంటుందని విమర్శించారు. సీఎంకి చేతకాకపోతే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సలహాలు తీసుకోవాలని అన్నారు.