ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో బాలుడు మృతి (వీడియో)

AP: పండగపూట రాష్ట్రంలో మరో విషాదం చోటు చేసుకుంది. శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బ మండలం దొరకల్లులో ఓ ఇంట్లోకి కారు దూసుకెళ్లడంతో బాలుడు మృతి చెందాడు. బాలాజీ అనే వ్యక్తి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కారు తీసుకొచ్చాడు. బ్రేక్ బదులు యాక్సలేటర్ తొక్కడంతో సమీపంలోని ఇంట్లోకి కారు దూసుకెళ్లింది. ఇంటి ముందు ఆడుకుంటున్న నిఖిల్ (5)ను కారు ఢీకొట్టడంతో బాలుడు ఎగిరిపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా.. బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్